
వెన్న ముద్దలు - డా. సూర్య గణపతి రావు గారు Vennamuddalu - Dr. Surya Ganapati Raoడాక్టర్ దేవగుప్తాపు సూర్య గణపతి రావుగారు వృత్తిపరంగా వైద్యులు. కానీ, గొప్ప గొప్ప కవుల సరసన చేరదగిన చేయితిరిగిన కవి. అంతేకాకుండా గొప్పనైన సాహిత్య విమర్శకుడు. వారు రాసిన పాండురంగ మహత్యం యొక్క వ్యాఖ్య మీకు తెలుగు పరిశోధనలో అందుబాటులోనే ఉంది. కొమ్ములు తిరిగిన పండితులు కూడా తడబడేటువంటి ప్రౌఢ పదబంధాన్ని వ్యాఖ్యానించిన వారి నేర్పరితనం బహుధా ప్రశంసనీయం. అంతేకాదు, అన్నమయ్య కీర్తనలకు వారు చెప్పిన భాష్యం ఒక కొత్త అందాన్ని తెచ్చింది. దీనివల్ల వారికి తెనుగు...